టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండో రోజు మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్ కల్యాణ మండపంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ప్రభుత్వ బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు కమలాపురం, 1 నుంచి 2.30 గంటల వరకూ ప్రొద్దుటూరు, మధ్యాహ్నం 2.30 - 3.30 సమయం భోజన విరామం. సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పులివెందుల, 5 నుంచి 6.30 గంటల వరకు జమ్మలమడుగు, 6.30 నుంచి 8 గంటల వరకు మైదుకూరు, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు కడప నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు.
కడప పర్యటనలో చంద్రబాబు నేటి కార్యక్రమాలు